![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -555 లో... కార్తీక్, జ్యోత్స్న స్టేషన్ కి బయల్దేరతారు. కార్తీక్ మధ్యలో కార్ ఆపుతాడు. జ్యోత్స్నని దిగమని చెప్తాడు. ఏంటి బావ ఇక్కడ అపావని జ్యోత్స్న అడుగుతుంది. దీనంతంటికి కారణం జ్యోత్స్ననే అని కార్తీక్ ఇండైరెక్ట్ గా మాట్లాడుతాడు. నువ్వు ఏం అంటున్నావో నాకు అర్థం అయింది బావ కానీ శివన్నారాయణకి ఏకైక వారసురాలిని నేను.. ఇలా నా రెస్టారెంట్ గురించి ఎందుకు చేసుకుంటానని జ్యోత్స్న అంటుంది.
నువ్వు అని ఎవరు చెప్పారని కార్తీక్ అనగానే జ్యోత్స్న ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. అంటే నువ్వు అలా ఫీల్ అవ్వడం లేదుగా అని కార్తీక్ అంటాడు. నేను అనుకోకపోవడం ఏంటని జ్యోత్స్న అంటుంది. నాకు కాశీ అంత చెప్పాడు.. వైరా, కాశీ ఫోన్ రికార్డింగ్ చూస్తే నీ పరిస్థితి ఏంటి మళ్ళీ అత్తకి లేనిపోని టెన్షన్ ఎందుకని వదిలేస్తున్న ఇక మీదుట అసలు ఊరుకోనని జ్యోత్స్నకి కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు.
ఆ తర్వాత ఇద్దరు స్టేషన్ కి వెళ్తారు. శ్రీధర్ ని స్టేషన్ నుండి వదిలేస్తారు. వైరా, కాశీని సెల్లో వేస్తారు. నిన్ను నా కొడుకు అనుకుని దగ్గర ఉంచుకుని అన్నీ నేర్పించి నీ చేత సొంతంగా రెస్టారెంట్ పెట్టిద్దామనుకున్న కానీ ఇలా వెన్నుపోటు పొడుస్తావనుకోలేదని కాశీతో శ్రీధర్ చెప్తూ ఎమోషనల్ అవుతాడు.
ఆ తర్వాత శివన్నారాయణ దగ్గరికి శ్రీధర్ వెళ్లి మావయ్య గారు నన్ను క్షమించండి అని అంటాడు. నువ్వు ఏం తప్పు చెయ్యలేదు మన సంస్థని కాపాడడానికి కార్తీక్ ఉన్నాడుగా అని శివన్నారాయణ మురిసిపోతాడు. కాశీని తీసుకొని రాలేదని పారిజాతం కోప్పడుతుంది. మీకు ఒక్కరికే తనపై బాధ్యత ఉన్నట్లు మాట్లాడకండి అని పారిజాతంపై దీప కోప్పడుతుంది. అనవసరంగా కాశీనీ ఇందులో లాగింది ఈ జ్యోత్స్ననే.. దీని సంగతి చెప్తానని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |